![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -318 లో..... నన్ను క్షమించండి అంటూ సీతాకాంత్, రామలక్ష్మిలని రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది శ్రీలత. నా కూతురు ప్రాణాలు కాపాడమని రామలక్ష్మిని శ్రీలత బ్రతిమిలాడుతుంది. నేను నమ్ముతున్నా మా అమ్మ అంత రిక్వెస్ట్ చేస్తుంది.. ఎందుకు ఇలా మొండిగా ఉంటున్నావని రామలక్ష్మిపై సీతాకాంత్ కోప్పడతాడు. నా మాట విని రమ్మని ధన రిక్వెస్ట్ చేస్తాడు.
రేపు మేము వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తామని శ్రీలత వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు ఆలా చేస్తున్నావ్ వాళ్ళు అంతలా ప్రాధేయపడుతున్నారు. నా వాళ్ళు అక్కడ బాధపడుతుంటే నేనెలా ఇక్కడ హ్యాపీగా ఉండగలను. నువ్వు ఎంతో నాకు వాళ్ళు కూడా అంతే అయినా నువ్వు ఇక్కడే ఉందామంటే ఉంటాను కానీ ఒక జీవ్వచ్చవంలాగా అనగానే.. మీరు సంతోషంగా ఉండడం కావాలి.. నేను ఒప్పుకుంటున్నానని రామలక్ష్మి అంటుంది. మరుసటి రోజు శ్రీలత వాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. చాలా సంతోషంగా ఉందని శ్రీలత అంటుంది. ఇక బస్తీ వాళ్ళ అందరికి చెప్పి వెళ్తారు. మీరు వెళ్ళండి నేను వస్తానని రామలక్ష్మి వాళ్ళని పంపిస్తుంది.
ఇక రామలక్ష్మి స్టేషన్ కి వెళ్లి.. నాకు మా ఆయనకు ప్రాణహాని ఉంది.. దగ్గర వాళ్లే ఇలా చేస్తున్నారంటూ సీతాకాంత్ ఫ్రెండ్ సీఐకి రామలక్ష్మి కంప్లైంట్ ఇస్తుంది. మరోవైపు రామలక్ష్మి వస్తే ఇద్దరం ఒకేసారి ఇంట్లోకి వస్తామని సీతాకాంత్ వెయిట్ చేస్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది ఇద్దరు లోపలికి వస్తుంటే.. శ్రీవల్లి ఆపుతుంది. హారతి ఇస్తుంది. ఆ హారతి చీరపై పోస్తుంది. దాంతో అది అంటుకుంటుంది. రామలక్ష్మి ఇంకా భయపడుతుంది. అవన్నీ పట్టించుకోకుండా లోపలికి రండి అని శ్రీలత అనగానే.. రామలక్ష్మి వాళ్ళు లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |